ప్రొఫెసర్ పాడు పని.. విద్యార్థినిల నగ్న వీడియోలు తీసి..

తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు పెద్దలు.. ఆలాగే చూడాలి కూడా.. లోకం గురించి చెప్పేది, ఉన్నత స్థానానికి తీసుకెళ్లేది వారే కాబట్టి.. కానీ ప్రస్తుతం కొంతమంది గురువులు చేసే పనులు.. సమాజానికే సిగ్గుచేటుగా మారుతున్నాయి. పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇవ్వవలసినవారు..కామాంధులుగా మారుతున్నారు. మహిళల గురించి సమాజానికి చెప్పాల్సినవారే.. మహిళలపై దారుణానికి పాల్పడుతున్నారు.

తాజాగా ఒక ప్రొఫెసర్ విద్యార్థినులకు చదువు చెప్పి ఉన్నత స్థానానికి పంపించాల్సింది పోయి.. బెదిరించి వ్యభిచార గృహాలకు పంపుతున్నాడు. తాను చెప్పినట్టు చేయకపోతే వారి నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి మరీ విద్యార్థినులను వ్యభిచార కూపంలోకి లాగుతున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. పిలిభిత్ నగరంలో రాజకీయ మహిళా మహావిద్యాలయ అనే డిగ్రీ కళాశాలలో కమ్రాన్ ఆలాం అనే వ్యక్తి ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. అందరితో మంచిగా ఉండే ఇతను అంటే కాలేజ్ లో అందరికీ ఇష్టమే.. దీంతో అతను కూల్ డ్రింక్ తాగడానికి పిలిస్తే విద్యార్థినులు కాదనకుండా వెళ్తారు. అదే అదునుగా భావించిన కమ్రాన్ కూల్ డ్రింక్ తాగడానికి వచ్చిన అమ్మాయిలకు మత్తుమందు ఇచ్చి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం వారి నగ్న వీడియోలను షూట్ చేసి వారిని వ్యభిచారం చేయాలంటూ బెదిరించేవాడు. ఆలా చేయకపోతే ఆ వీడియోలను బయటపెడతానని బెదిరించడంతో పలువురు అమ్మాయిలు వ్యభిచారం చేయడం మొదలుపెట్టారు. ఇలా జరుగుతున్న క్రమంలో ఒక విద్యార్థిని ఈ విషయాన్ని తన బాయ్ ఫ్రెండ్ కి చెప్పింది.. అతను కాలేజ్ యాజమాన్యానికి తెలిపినా ప్రయోజనం లేకపోవడంతో యువతిని తీసుకొని వెళ్ళి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రొఫెసర్ గుట్టురట్టయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Related Articles

Latest Articles