బొగ్గు కొరత… ఆర్టీపీపీలో తగ్గిన విద్యుత్ ఉత్పత్తి

కడప జిల్లా ఎర్రగుంట్ల మండల పరిధిలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. ఆర్టీపీపీకి రావాల్సిన బొగ్గు సరఫరా ఆగిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీపీపీలో కేవలం 30 వేల టన్నులు మాత్రమే బొగ్గు నిల్వ ఉంది. ఆర్టీపీపీలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి.

ఈ యూనిట్లలో మొత్తం 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సి ఉంది. ప్రస్తుతం కేవలం 13, 6 యూనిట్లలో కలిపి 600 మెగావాట్లు ఉత్పత్తి జరుగుతోంది. వర్షాలు, భారీగా సంభవించిన వరదల వల్ల రైల్వే ట్రాక్ లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఆర్టీపీపీకి రావాల్సిన బొగ్గు రవాణా జరగలేదు. దీని వల్ల మిగిలిన నాలుగు యూనిట్లలో ఉత్పత్తి నిలిపివేసినట్లు ఆర్టీపీపీ అధికారులు. ఆర్టీపీపీలో తక్కువగా బొగ్గు అందుబాటులో వుండడం వల్లే విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో జరగడం లేదు.

Related Articles

Latest Articles