కోల్ దెబ్బ‌కు ఉక్కిరిబిక్కిర‌వుతున్న రాష్ట్రాలు…

బొగ్గు దెబ్బ‌మీద దెబ్బ కొడుతున్న‌ది.  ద‌క్షిణాదిన బొగ్గు స‌మ‌స్య‌లు  ఉన్న‌ప్పటికీ ఉత్త‌రాదితో పోలిస్తే త‌క్కువే అనిచెప్పాలి.  ఉత్త‌రాది రాష్ట్రాలు బొగ్గు స‌మ‌స్య‌తో అట్టుడికిపోతున్నాయి.  డిమాండ్ ఉన్న విద్యుత్ కంటె త‌క్కువ విద్యుత్ ఉత్ప‌త్తి అవుతుండ‌టంతో షార్టేజ్ వ‌స్తున్న‌ది.  ఫ‌లితంగా వినియోగ‌దారుల‌కు కోత‌లు విధిస్తున్నారు.  కొన్ని రాష్ట్రాల్లో కోత‌లు నాలుగు నుంచి ఐదు గంట‌ల వ‌ర‌కు ఉంటోంది. ఇక బొగ్గు సంక్షోభంతో పంజాబ్ రాష్ట్రం తీవ్ర‌మైన స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోంది.  అక్టోబ‌ర్ 11 వ తేదీన పంజాబ్ రాష్ట్రంలో ఏకంగా 2300 మెగావాట్ల విద్యుత్ కొర‌త ఏర్ప‌డింది.  అన్ని రాష్ట్రాల్లో కంటే పంజాబ్ రాష్ట్రంలో కొర‌త అధికంగా ఉండ‌టంతో విద్యుత్ కోత‌లు విధించ‌డం మొద‌లుపెట్టారు.  ప్ర‌తిరోజూ 4 నుంచి 7 గంట‌ల వ‌ర‌కు విద్యుత్ కోత‌లు ఉంటాయ‌ని ప్ర‌భుత్వం తెలియ‌జేసింది.  ప్ర‌తిరోజూ పంజాబ్‌లో 11,046 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండ‌గా, వినియోగ‌దారుల‌కు 8,751 మెగావాట్ల విద్యుత్‌ను మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేయ‌గ‌లిగారు.  దీంతో 2300 మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్ప‌డింది.  ఇక హ‌ర్యానాలో 63 మెగావాట్ల లోటు ఉండ‌గా, రాజ‌స్థాన్‌లో 272 మెగావాట్ల లోటు ఉన్న‌ది.  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 870 మెగావాట్లు, ఉత్త‌రాఖండ్‌లో 190 మెగావాట్లు, జ‌మ్మూకాశ్మీర్‌లో 200 మెగావాట్ల విద్యుత్ లోటు ఉన్న‌ది.  అయితే, ఢిల్లీ, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ఎలాంటి కొర‌త లేద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. 

Read: కాంగ్రెస్ ప‌ట్టు: కేంద్ర మంత్రిని తొల‌గించాల్సిందే…

-Advertisement-కోల్ దెబ్బ‌కు ఉక్కిరిబిక్కిర‌వుతున్న రాష్ట్రాలు...

Related Articles

Latest Articles