నేడు తిరుమలకు సీఎం జగన్‌.. రెండు రోజుల పర్యటన..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు.. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు.. తిరుమలలో ఆయన పర్యటన కొనసాగనుంది.. శ్రీవారి బహ్మోత్సవాల్లో పాల్గొననున్న ఆయన, పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు. ఇవాళ మధ్యహ్నం 2:55 గంటలకు తిరుపతి చేరుకోనున్న సీఎం జగన్.. మధ్యాహ్నం 3:30 గంటలకు బర్డ్‌లో రూ.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన చిన్న పిల్లలు ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. ఇక, సాయంత్రం 4 గంటలకు అలిపిరి నడకమార్గం, గో మందిరం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు తిరుమల చేరుకోనున్న సీఎం జగన్.. సాయంత్రం 5:50 బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకొని.. 6:05 గంటలకు బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్ర్తాలతో ఉరేగింపులో బయల్దేరి.. సాయంత్రం 6:20 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.. శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించి స్వామివారిని దర్శించుకుంటారు.

ఇక, సాయంత్రం 6:50 గంటలకు 2022 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ప్రారంభించనున్నారు సీఎం వైఎస్‌ జగన్.. 7:00 గంటలకు గరుడ వాహన సేవలో పాల్గొననున్న ఆయన.. 7:05 గంటలకు పద్మావతి అతిథి గృహానికి తిరుగు ప్రయాణం అవుతారు.. ఇక, మంగళవారం ఉదయం 5:30 గంటలకు శ్రీవారిని మరోసారి దర్శించుకోనున్నారు సీఎం.. ఉదయం 6:25 గంటలకు కర్నాటక సీఎం బోమ్మైతో కలసి ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానల్స్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.. 6:50 గంటలకు బూందీ పోటు ప్రారంభం.. తర్వాత 7 గంటలకు అన్నమయ్య భవనానికి చేరుకోనున్న సీఎం.. ఇటీవల టీటీడీ తీసుకున్న నిర్ణయాలు పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ వీక్షించనున్నారు.. టీటీడీ, రైతు సాధికారిక సంస్థ మధ్య ఎంఓయూ పై సంతకాలు కార్యక్రమం జరగనుండదా.. 8 గంటలకు పద్మావతి అతిథి గృహానికి చేరుకోనున్న సీఎం.. ఉదయం 9 గంటలకు తిరుమల నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక, సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.

-Advertisement-నేడు తిరుమలకు సీఎం జగన్‌.. రెండు రోజుల పర్యటన..

Related Articles

Latest Articles