పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం.. పనులపై ఆరా

పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.. ఇక, ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఇప్పటికే పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి పనులు పురోగతిపై ఆరా తీయగా… ఇవాళ మరోసారి పోలవరం డ్యామ్‌ సైట్‌కు వెళ్లారు.. స్పిల్‌వేపైకి వెళ్లి స్వయంగా జరిగిన పనుల్ని పరిశీలించిన సీఎంకు.. స్పిల్‌వేపై ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా పోలవరం పనుల పురోగతిని అధికారులు వివరించారు..రెండేళ్లలో పూర్తయిన పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. తర్వాత అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం.. ప్రాజెక్టుపై దిశానిర్దేశం చేశారు.

స్పిల్‌వే పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి.. 48 గేట్లలో 42 గేట్లు అమరిక, మిగిలిన గేట్లను కూడా త్వరలోనే బిగిస్తామని తెలిపిన అధికారులు, జర్మనీ నుంచి సిలెండర్ల వచ్చాయని, ఎగువ కాఫర్‌డ్యాంలో అదివరకు ఉన్న ఖాళీలను పూర్తిచేశామని, దిగువ కాఫర్‌డ్యాం పనులు పరిస్థితిని వివరించారు.. ఎర్త్‌కం రాక్‌ఫిల్‌డ్యాం(ఈసీఆర్‌ఎఫ్‌)పనులపై అధికారులను అడిగారు సీఎం.. 2023 ఖరీఫ్‌ సీజన్‌కల్లా ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పూర్తిచేయాలని ఆదేశించారు.. కాఫర్‌ డ్యాంలో ఖాళీలు కారణంగా గతంలో వచ్చిన వరదలకు ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ప్రాంతం దెబ్బతిందని… దీనిపనులు ఎలా చేయాలన్న దాని పై డిజైన్లు కూడా ఖరారు అవుతాయని అధికారులు తెలిపారు.. 2022 జూన్‌ కల్లా లైనింగ్‌తో కలుసుకుని రెండు కాల్వలకు లింకు పనులు పూర్తికావాలని, టన్నెల్‌పనులు, లైనింగ్‌పనులు పూర్తికావాలని ఆదేశించారు.. డిసెంబర్‌ కల్లా తవ్వకం పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత మిగిలిన పనులు పూర్తిచేశామన్నారు.. ఇక, పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ పైనా సీఎం సమీక్షించారు.. మొత్తం 90 ఆవాసాల్లో ఆగస్టు నాటికి 48 ఆవాసాలనుంచి నిర్వాసితులను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎంకు వివరించారు అధికారులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-