తిరుప‌తిలో బిజీబిజీగా సీఎం జ‌గ‌న్‌…

తిరుప‌తిలో సీఎం జ‌గ‌న్ రెండు రోజుల పాటు ప‌ర్య‌టిస్తున్నారు.  ఈరోజు మ‌ధ్యాహ్నం గ‌న్న‌వ‌రం నుంచి తిరుప‌తికి చేరుకున్నారు.  అనంత‌రం సీఎం జ‌గ‌న్ బ‌ర్డ్‌లో  శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌ పిల్ల‌ల కార్డియాక్ ఆసుప‌త్రిని ప్రారంభించారు.  ఆ త‌రువాత అలిపిరి వ‌ద్ధ శ్రీవారి పాదాల వ‌ద్ద నుంచి న‌డ‌క మార్గంలో కొత్త‌గా ఏర్పాటు చేసిన పైక‌ప్పును,  గో మందిరాన్ని ప్రారంభించారు.  ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో బ్ర‌హ్మోత్సవాలు జ‌రుగుతున్నాయి.  ఈ బ్ర‌హ్మోత్స‌వాల్లో సీఎం జ‌గ‌న్ పాల్గొన‌బోతున్నారు.  తిరుమ‌ల‌కు చేరుకున్న త‌రువాత సీఎం బేడి ఆంజ‌నేయ స్వామివారిని ద‌ర్శించుకుంటారు.  ఆ త‌రువాత రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రుపున స్వామి వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించనున్నారు.  శ్రీవారిని ద‌ర్శనం చేసుకున్న అనంత‌రం సీఎం జ‌గ‌న్ ప‌ద్మావ‌తి గెస్ట్ హౌస్‌కు వెళ్లి రాత్రి అక్క‌డే బ‌స చేయ‌నున్నారు.  

Read: విద్యుత్ వినియోగంపై స‌జ్జ‌ల కీల‌క వ్యాఖ్య‌లు…

-Advertisement-తిరుప‌తిలో బిజీబిజీగా సీఎం జ‌గ‌న్‌...

Related Articles

Latest Articles