వైఎస్సార్‌ వర్ధంతి.. ఇడుపులపాయకు ఏపీ సీఎం..

దింగత నేత వైఎఎస్సార్‌ వర్థంతిని పురస్కరించుకుని ఇడుపులపాయకు వైఎస్‌ఆర్‌ అభిమానులు క్యూ కడుతున్నారు. నివాళులు అర్పించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇడుపులపాయకు చేరుకున్నారు. అనంతరం సొంత నియోజకవర్గ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.. ఇక, కడప జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్‌కు.. పార్టీ శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. కడప విమానాశ్రయం వద్ద, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు.

తర్వాత హెలికాప్టర్‌లో ఇడుపుల పాయ చేరుకున్నారు సీఎం జగన్. సాయంత్రం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌లో … జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను ఎదుర్కోవాల్సి ఉన్నందున.. దీనికి సంబంధించి పార్టీ నేతలతో సమీక్ష చేశారు. రాత్రి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. ఇవాళ ఉదయం ఇడుపుల పాయలోని దివంగత సీఎం, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్‌ను సందర్శించనున్నారు సీఎం జగన్. తండ్రికి నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. తల్లి విజయమ్మ, భార్య వైఎస్ భారతి, బాబాయ్, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులతో కలిసి తండ్రి సమాధికి నివాళి అర్పిస్తారు. తర్వాత పార్టీ నాయకులతో సమావేశమవుతారు.. మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.

Related Articles

Latest Articles

-Advertisement-