ఈనెల 22 న యాదాద్రిలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌… ఆ గ్రామంలో సామూహిక భోజ‌నం…

ఈ నెల 22 వ తేదీన సీఎం కేసీఆర్ యాదాద్రిలో ప‌ర్య‌టింబోతున్నారు.  ఈనెల 19 త‌రువాత రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌లు ఉంటాయ‌ని ముఖ్య‌మంత్రి ముందుగా చెప్పిన సంగ‌తి తెలిసిందే.  ఇందులో భాగంగా మొద‌ట‌గా వైఎస్ జ‌గ‌న్ యాదాద్రిలో ప‌ర్య‌టించ‌బోతున్నారు.  జిల్లాలోని తుర్కుప‌ల్లి మండ‌లంలోని వాసాలమ‌ర్రి గ్రామాన్ని సీఎం దత్త‌త తీసుకున్నారు.  ద‌త్త‌త తీసుకున్న గ్రామంలో ఈనెల 22 న ప‌ర్య‌టించ‌నున్నారు.  

ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా ఆస్పత్రుల పై చర్యలు

ఆ గ్రామ స‌ర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు.  గ్రామంలో స‌మూహిక భోజ‌నాలు చేసిన అనంత‌రం గ్రామ‌స‌భ‌ను ఏర్పాటు చేసి స‌మ‌స్య‌ల‌పై చర్చిద్దామ‌ని సీఎం కేసీఆర్ గ్రామ స‌ర్పంచ్‌కు ఫోన్‌లో తెలిపారు.  ఇక ఇప్ప‌టికే యాదాద్రి జిల్లా క‌లెక్ట‌ర్ గ్రామంలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌కు సంబందించిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు.  అధికారుల ప‌నీతీరును చెక్ చేసేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-