మేం ఉద్యమ కారులం..బీజేపీని వెంటాడుతాం,వేటాడుతాం – కేసీఆర్

ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్‌ చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ పార్టీని వెంటాడుతాం… వేటాడుతామని వార్నింగ్‌ ఇచ్చారు కేసీఆర్‌. తాము ఉద్యమ కారులమని…కేంద్రంపై కొట్లాడటంపై కొత్తేమీ కాదన్నారు కేసీఆర్‌. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని… ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనన్నారు.

ధాన్యం కొనుగోలు అంశంపై ప్రశ్నిస్తే…కేంద్రం ఉలుకు లేదు…పలుకు లేకుండా వ్యవహరిస్తుందని నిప్పులు చెరిగారు కేసీఆర్‌. కేంద్ర ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలు అంశంపై స్పష్టత రాకపోతే తెగించి కొట్లాడతామని.. తమ రైతులు నష్ట పోకుండా పంట మార్పిడిపై దిశానిర్దేశం చేస్తామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌. నవంబర్‌ 18 న ఇందిరా పార్క్‌ దగ్గర ధర్నా చేస్తామని.. తర్వాత.. గవర్నర్‌ కు వినతి పత్రం ఇస్తామన్నారు కేసీఆర్‌. ధర్నా తర్వాత రెండు రోజుల్లోగా కేంద్రం స్పందించకపోతే స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తాం, పార్లమెంట్‌లోనూ, అన్ని చోట్లా వెంటాడతామని వార్నింగ్‌ ఇచ్చారు కేసీఆర్.

Related Articles

Latest Articles