తెలంగాణ వడ్లు కొంటారా ? కొనరా ? : సీఎం కేసీఆర్ ఫైర్

తెలంగాణ పండించే వడ్లు కొంటరా ? కొనరా ? అని ప్రశ్నించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. సూటిగా సమాధానం చెప్పకుండా వంకర టింకరగా సమాధానం చెబుతే బాగుండని హెచ్చరించారు సీఎం కేసీఆర్‌. ఇవాళ ఇందిరా పార్క్‌ లో నిర్వహించిన మహా ధర్నా లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… బీజేపీ మాట్లాడితే అబద్దాలని… అబద్దాలు మాట్లాడుతూ.. అడ్డగోలు పాలన చేస్తోందని ఫైర్‌ అయ్యారు. ఏడాదిగా ఢిల్లీ లో రైతులు ఆందోళనలు చేస్తున్నారని… ఈ సభలో కూడా బీజేపీకి సీఐడీలు ఉన్నారని ఫైర్‌ అయ్యారు.

నిన్న కూడా ప్రధానికి లేఖ రాశానని… వడ్లు కొంటారా కొనరా అని అడిగితే ఉలుకు పలుకు లేదని ఆగ్రహించారు కేసీఆర్‌. పాక్‌, బంగ్లాదేశ్‌ కన్నా దీన స్థితిలో ఇండియా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన.. వ్యవసాయ చట్టాలు నిరంకుశ చట్టాలని ఫైర్‌ అయ్యారు. రైతులను కేంద్రం బతకనిస్తదా ? బతకనివ్వదా ? అని నిలదీశారు సీఎం కేసీఆర్‌. దిక్కుమాలిన ప్రభుత్వం కేంద్రంలో ఉందని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు సీఎం కేసీఆర్‌. బీజేపీ ప్రభుత్వానికి చరమ గీతం పాడాలన్నారు.

Related Articles

Latest Articles