వరంగల్‌ అర్బన్‌ ఇక హన్మకొండ జిల్లా..!

తెలంగాణలో జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాను విభజించారు.. ప్రస్తుతం వరంగల్‌ అర్బన్, వరంగల్ రూరల్ అంటూ.. ఒకే పేరుతో రెండు జిల్లాలు ఉన్నాయి.. అయితే, వరంగల్‌ అర్బన్‌ను హన్మకొండ జిల్లాగా.. వరంగల్‌ రూరల్‌ను వరంగల్‌ జిల్లాగా మార్చనున్నట్టు వెల్లడించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రెండు, మూడు రోజుల్లో వెలువడతాయని తెలిపారు.. వరంగల్‌ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. ఇవాళ వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. హన్మకొండలో కలెక్టరేట్‌ సముదాయాన్ని ప్రారంభించారు. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం.. వరంగల్‌ చరిత్రను.. తెలంగాణ ఉద్యమంలో వరంగల్‌ పాత్రను గుర్తుచేవారు.. వరంగల్‌ వైభవం చాటిచెప్పేలా కలెక్టరేట్‌ నిర్మించారని కితాబిచ్చారు. ప్రజల పనులు వేగంగా జరిగితేనే ప్రజాస్వామ్యానికి సార్థకం. ప్రజలు తమ పనుల కోసం పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు.. ఇక, రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు మరో 4 నగరాలు అభివృద్ధి చెందాలన్న ఆయన.. వరంగల్‌ సిటీలో డెంటల్ ఆస్పత్రి, కాలేజ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో జనాభా విపరీతంగా పెరిగిపోయిందని, రాష్ట్రం మొత్తం హైదరాబాద్‌పై ఆధారపడితే జిల్లాలకు నష్టం కలుగుతుందని అన్నారు. ఇతర జిల్లాలు కూడా అభివృద్ధి చెందితే హైదరాబాద్‌పై భారం తగ్గుతుందని చెప్పారు. రేపు రేపు హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు వచ్చే పరిస్థితి రావాలన్నారు. ఇక, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-