బిగ్ బ్రేకింగ్ : కరోనా నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్

కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ సిఎం కెసిఆర్ కొలుకున్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం.. సీఎం కెసిఆర్ కు ఇవాళ తన వ్యవసాయ క్షేత్రంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసియార్ పరీక్షలు నిర్వహించారు. యాంటిజెన్ టెస్టులో సిఎం కెసిఆర్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. ఇక ఆర్టీపీసియార్ పరీక్షా ఫలితాలు రేపు రానున్నాయి. కాగా సిఎం కెసిఆర్ కు ఈ నెల 19న కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles

-Advertisement-