మరోసారి మీడియా ముందుకు సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి మీడియాతో మాట్లాడనున్నారు. శనివారం రాత్రి 7 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశముందని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు వరి కొనుగోళ్ల అంశంపైనా కేసీఆర్ మాట్లాడే ఛాన్స్ ఉంది. ఈ ప్రెస్‌మీట్‌లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రగతి భవన్‌లో పలువురు మంత్రులతో కేసీఆర్ ఇప్పటికే చర్చలు జరిపారని సమాచారం. కాగా మరో మూడురోజుల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ గడువు ముగియనుంది.

Related Articles

Latest Articles