కేంద్రంపై యుద్దం ఇక ఆగదు : సీఎం కేసీఆర్

ధాన్యం కొనుగోలు అంశం నేపథ్యంలో కేంద్రంపై యుద్ధం ఇక ఆగబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాసేపటి క్రితమే.. ఇందిరా పార్క్‌ వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహిస్తున్న మహా ధర్నాలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… కేంద్రం రైతుల పట్ల వ్యతిరేకతతో ఉందని… కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగామని స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా ఉధృతం చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.


పంజాబ్ లో కొన్నట్లు ఇక్కడ కూడా వరి ధాన్యం కొనాలని స్వయంగా కోరానని తెలిపారు. ప్రధాని మోడీకి లేఖ రాసినా… ఉలుకు లేదు పలుకు లేదని ఫైర్‌ అయ్యారు కేసీఆర్. ఇది ఈ రోజుతో ఆగేది కాదని…కేంద్రం దిగివచ్చి రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగబోదన్నారు. తెలంగాణలోని గ్రామాల్లోనూ ఈ ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.

Related Articles

Latest Articles