కాసేపట్లో జగిత్యాలకు సీఎం కేసీఆర్

నేడు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను సీఎం కేసీఆర్‌ పరామర్శించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డుమార్గం ద్వారా సుమన్‌ స్వగ్రామమైన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని రేగుంటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు సుమన్ ఇంటివద్ద ఉండనున్నారు. సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి నివాళులర్పిస్తారు. సుమన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్ వెళ్లనున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-