నేడు ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ !

ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ లతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యం లోనే సీఎం కేసీఆర్‌ తన ఢిల్లీ పర్యటన ను మరో రెండు రోజుల పొడిగించుకున్నారు. గోదావరి, కృష్ణానదీ జలాల వ్యవహారం, కేంద్ర గెజిట్ పై ప్రధాని మోడీ మరియు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ లతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్‌. అలాగే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల పై ప్రధాని మోడీతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. అంతేకాదు… రేపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా విభజన కు సంబంధించిన హామీలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా.. టీఆర్‌ఎస్‌ పార్టీ భవన శంకుస్థాపన నేపథ్యం లో నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిన్న ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-