కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం…కరోనాపై కీలక నిర్ణయం తీసుకుంటారా?  

కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం...కరోనాపై కీలక నిర్ణయం తీసుకుంటారా?  

ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.  కరోనా నుంచి కోలుకున్న తరువాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.  ఈ సమావేశంలో కరోనా మహమ్మారిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సంచారం.  కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది.   ప్రస్తుతం ఆరోగ్యశాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనే ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.  ఇక ఇదిలా ఉంటె, గతనెల 19 వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడ్డారు.  ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్న కేసీఆర్ కొన్నిరోజులు ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకున్నారు.  కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో కేసీఆర్ తిరిగి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు చేరుకున్నారు.  ఏప్రిల్ 20 వ తేదీ నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతున్నది.  మే 8 వ తేదీతో నైట్ కర్ఫ్యూ ముగుస్తుండటంతో దీనిపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-