డయాగ్నస్టిక్ సెంటర్ల ఓపెనింగ్ కు బ్రేక్ : సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం

డయాగ్నస్టిక్ సెంటర్ల ఓపెనింగ్ పై సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి (7న) ప్రారంభించాలనుకున్న 19 జిల్లాల్లో 19 డయాగ్నటిక్ సెంటర్లను జూన్ 9 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అందరు మంత్రులు ఏక కాలంలో పాల్గొని వొకే రోజు ఒకే సమయంలో 19 సెంటర్లను ప్రారంభించాలని సిఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో… ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయం మీద జూన్ 8 న జరిగే మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-