మరో కొత్త పథకానికి కేసీఆర్ సర్కార్ శ్రీకారం

దేశంలోనే ప్రతిష్టాత్మక పథకాలతో ముందున్న తెలంగాణ రాష్ట్రం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతు భీమా పథకాలతో పాటు రైతు వేదికల వంటి నిర్మాణాలను చేపట్టిన కేసీఆర్ సర్కార్ తాజాగా రైతుల కోసం మరో పథకాన్నితీసుకురాబోతున్నట్లు సమాచారం. 47 ఏళ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులకు నెలకు రూ. 2,016 పెన్షన్ ఇచ్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. 3 నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఈ పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే దీనికోసం రాష్ర్ట ఖజనాపై ఎంత భారం పడుతుందనే దానిపై సర్కార్‌ లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రైతుల కోసం అనేక పథకాలు చేపట్టిన కేసీఆర్ సర్కార్.. వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

Read Also: ఏపీలో మూడు వేలు దాటిన కరోనా కేసులు

రైతుబంధుతో ఇప్పటికే 50 వేల కోట్లను ఖర్చు చేసింది. రైతు భీమా ద్వారా.. మరణించిన రైతులకు రూ. 5 లక్షల బీమా వచ్చేలా ఇన్సూరెన్స్ చేస్తోంది.రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పంచాయతీ నడుస్తున్న ఈ సమయంలో కొత్త పథకంతో మరోసారి ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొవచ్చనే భావనతో గులాబీ బాస్‌ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుంటుంది. మరోవైపు కాంగ్రెస్‌ కూడా టీఆర్‌ఎస్‌ పై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శల దాడులకు దిగుతోంది. దీంతో వారికి చెక్‌ పెట్టడంతో పాటు రైతులకు మేలు జరిగేలా ఈ పథకానికి వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. ఈ పథకం అమలైయితే చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఊరట లభించనుంది.

Related Articles

Latest Articles