గుంటూరు జిల్లాలో నేడు సీఎం జగన్‌ పర్యటన

గుంటూరు జిల్లాలో నేడు ఏపీ సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యానగర్‌లో ఐటీసీ సంస్థ నిర్మించిన గ్రాండ్‌ స్టార్ హోటల్​ను ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ ద్వారా గుంటూరు చేరుకుంటారు. పోలీస్ మైదానంలో హెలిప్యాడ్ వద్ద దిగి.. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా హోటల్‌కు బయలుదేరి 11గంటలకు హోటల్ ను ప్రారంభిస్తారు.

ప్రారంభ కార్యక్రమంలో 45 నిమిషాల పాటు పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా తాడేపల్లిలోని తన నివాసానికి బయలుదేరుతారు. అయితే ఇప్పటికే మంత్రులు సుచరిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఏర్పాట్లను పరిశీలించారు.

Related Articles

Latest Articles