సీఎం జగన్‌ ఇవాళ్టి విశాఖ పర్యటన రద్దు

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి… ఇవాళ్టి విశాఖ పర్యటన రద్దు అయింది. షెడ్యూల్‌ ప్రకారం.. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటన లో వెల్లడించింది. అయితే… విశాఖ టూర్‌ షెడ్యూల్‌ ప్రకారం.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు గన్న వరం విమానాశ్రమం నుంచి విశాఖ బయలు దేరాల్సి ఉంది.

సాయంత్రం 5.20 గంటలకు విశాఖ చేరుకుని ఎన్‌ఏడీ జంక్షన్‌ లో ఫ్లై ఓవర్‌ తో పాటు.. వీఎంఆర్‌డీఏ పూర్తి చేసిన 6 ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు సీఎంవో అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5.55 గంటలకు వూడా పార్క్‌ కు చేరుకుని.. వూడా పార్క్ తో పాటు జీవీఎంసీ పూర్తి చేసిన 4 స్మార్ట్‌ ప్రాజెక్టుల ప్రారంభం.. ఎంజీఎం పార్క్‌ లో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ కుమార్తె వివాహానికి హాజరు కావాల్సి ఉంది. కాగా.. ఏపీలో ప్రస్తుతం టీడీపీ మరియు వైసీపీ ల మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles