పోలవరం బిల్లుల చెల్లింపు పై సీఎం సమీక్ష…

కేంద్రం నుంచి పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయన్న సీఎం… పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతా ఉన్న ప్రాజెక్టు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తిచేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగా డబ్బులు ఇస్తున్నాం అన్నారు. ఈ ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా ప్రజలకు అందించాలనే తపనతో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన ఖర్చుకు సంబంధించి కేంద్రంలో బిల్లులు పెండింగులో ఉండడం సరికాదు. అధికారులు వెంటనే దీనిపై దృష్టిపెట్టాలి. చేసిన ఖర్చు వెంటనే రీయింబర్స్‌ అయ్యేలా చూడాలి. వచ్చే మూడు నెలలకాలానికి కనీసం రూ.1400 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఢిల్లీ వెళ్లి వెంటనే పెండింగులో ఉన్న బిల్లులు క్లియర్‌ అయ్యేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-