కైకాల కుమారుడికి ఫోన్ చేసిన సీఎం జగన్‌

ప్రముఖ సీని నటుడు కైకాల సత్యనారాయణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే.. ఇప్పటికే ఆయన ఆరోగ్యం కాస్త నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వయోభారం కారణంగా ఆయన శరీరం చికిత్సకు సహకరించటం లేదని వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ కైకాల కుమారుడికి ఫోన్‌ చేసి ఆయన ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. ఆయనకు చికిత్స జరిగే తీరును .. డాక్టర్లు ఏం చెబుతున్నారో అని ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటామని కైకాల కుమారుడికి సీఎం జగన్‌ ధైర్యం చెప్పారు. ఆయన ఆరోగ్య పరి స్థితిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని, డాక్టర్లు ఆయన ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తెలపాలన్నారు.

Related Articles

Latest Articles