కైకాల ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా

టాలీవుడ్ లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స జరుగుతోంది. 86 ఏళ్ల కైకాల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా అప్పటి నుండి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్టు సమాచారం.

Read Also : పవన్, ఎన్టీఆర్, మహేష్ ఒకే ఫ్రేమ్ లో ?

కైకాల చిన్న కుమారుడు కే జి ఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామారావు అలియాస్ చిన్నబాబుకు జగన్ ఫోన్ చేసి కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారట. అంతేకాకుండా ప్రభుత్వం తరఫున ఏమైనా సహాయం కావాలంటే అడగాలని, ధైర్యంగా ఉండాలని కోరారట. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక ఐఏఎస్ అధికారి కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది తెలుసుకోవడానికి వస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మచిలీపట్నం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పేర్ని నాని కూడా కైకాలను పరామర్శించిన విషయం తెలిసిందే. అలాగే చిన్న బాబుతో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా ఫోన్లో కైకాల ఆరోగ్యం గురించి మాట్లాడి ధైర్యం చెప్పారు.

Related Articles

Latest Articles