15 రోజుల్లో కోవిడ్ హాస్పిటల్ : సిఎం జగన్ ఫిదా

తాడిపత్రి అర్జాస్‌ స్టీల్స్‌ వద్ద 500 బెడ్ల కోవిడ్‌ తాత్కాలిక ఆసుపత్రిని వర్చువల్‌ ద్వారా క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. కేవలం రెండు వారాల రికార్డు సమయంలో 11.50 ఎకరాల విస్తీర్ణం, లక్ష చదరపు అడుగులు, అత్యాధునిక సౌకర్యాలతో కోవిడ్‌ హాస్పిటల్‌ ను సిఎం జగన్ ఆదేశాలతో నిర్మించారు. ప్రతీ పేషెంట్‌ బెడ్‌ వద్ద ఆక్సీజన్, ప్రతీ 30 బెడ్లకు నర్సింగ్‌ స్టేషన్, 200 మంది నర్సులు, 50 మందికి పైగా డాక్టర్లు, మొత్తం 350 మందికి పైగా వైద్య సిబ్బందితో ఈ హాస్పిటల్‌ ఏర్పాటు చేశారు. యుద్ధప్రాతిపదికన 500 ఆక్సిజన్ పడకల ఆసుపత్రి నిర్మించడం పట్ల సిఎం జగన్ ఫిదా అయ్యారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు, అర్జాస్‌ స్టీల్స్‌ ఎండీ శ్రీధర్‌ కృష్ణమూర్తిని ఈ సందర్బంగా ప్రత్యేకంగా అభినందించారు సీఎం వైఎస్‌ జగన్‌. ఈ కష్టకాలంలో మీరు చేసిన సాయం మరువలేనిదన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-