నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జ‌గ‌న్‌…ప‌లువురు కేంద్ర మంత్రులతో భేటీ…

ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్ల‌బోతున్నారు.  ఉద‌యం 11 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌లోని గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ నుంచి బ‌య‌లుదేరి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఢిల్లీ చేరుకుంటారు.  ఢీల్లీలో ఏపీ అధికారుల‌తో చ‌ర్చించిన త‌రువాత సీఎం ఈరోజు రాత్రి 9 గంట‌ల‌కు కేంద్ర‌మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.  పోల‌వ‌రం ప్రాజెక్ట్‌కు సంబందించిన నిధులు, విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీలు త‌దిత‌ర విష‌యాల‌పై షాతో చర్చిస్తారు. అనంత‌రం సీఎం కేంద్ర జ‌ట‌వ‌న‌రుల శాఖ మంత్రి షెకావ‌త్, మ‌రోకేంద్ర మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్‌తో భేటీ అవుతారు.  రాష్ట్రానికి చెందిన ప‌లు విష‌యాల గురించి ఈ భేటీలో చ‌ర్చించ‌బోతున్నారు.  ఈరోజు రాత్రికి ఢిల్లీలోనే ఉండి రేపు మ‌ధ్యాహ్నానికి సీఎం జ‌గ‌న్ తిరిగి అమ‌రావ‌తి చేరుకుంటారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-