తాడేపల్లిలో సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న సీఎం జగన్ దంపతులు

గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం జగన్ దంపతులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సంప్రదాయ బట్టల్లో కనిపించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం సమీపంలోని గోశాలలో జరిగిన సంక్రాంతి సంబరాలకు సీఎం జగన్, ఆయన సతీమణి భారతి హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ వేడుకలను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

పల్లెటూళ్లలో సంక్రాంతి సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహిస్తారో వాటిని అన్నింటినీ తాడేపల్లి గోశాలలో నిర్వహించారు. గోవులకు ప్రత్యేక పూజలు, భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలతో వైభవంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Related Articles

Latest Articles