చంద్రబాబుది అంతా డ్రామా.. కావాలనే రెచ్చగొట్టారు: జగన్

ఏపీ అసెంబ్లీలో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనపై ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రస్తావించారు. తాను సభలోకి వచ్చే సమయంలో చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారని, చంద్రబాబు సంబంధం లేని విషయాలు తీసుకువచ్చి రెచ్చగొట్టారని జగన్ ఆరోపించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు.

Read Also: మీడియా ముందే బోరున విలపించిన చంద్రబాబు

వైఎస్ వివేకానందరెడ్డి తన బాబాయ్ అని… ఆయనతో చంద్రబాబుకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. వివేకా హత్య చంద్రబాబు హయాంలో జరిగిందని, తన చిన్నాన్నను టీడీపీ వాళ్లే ఏదైనా చేసి ఉండాలని జగన్ ఆరోపించారు. ‘ఓ వైపు మా నాన్న తమ్ముడు, ఇంకో వైపు నాన్న తమ్ముడి కొడుకు. ఒక కన్ను ఇంకో కన్నును ఎందుకు పొడుచుకుంటుంది’ అని జగన్ నిలదీశారు. వంగవీటి రంగా, ఎలిమినేటి మాధవరెడ్డి హత్యలు చంద్రబాబు హయాంలోనే జరిగాయని జగన్ గుర్తుచేశారు. మల్లెల బాబ్జీ తన సూసైడ్ నోట్‌లో చంద్రబాబు పేరు రాశాడని జగన్ తెలిపారు. తనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి మీడియా వ్యవస్థలు లేవు అని… తప్పుడు వార్తలు పదేపదే చెప్తే నిజం అవుతుందని అనుకుంటున్నారని… చంద్రబాబు కళ్లలో నీళ్లు లేకపోయినా నీళ్లు వచ్చాయని డ్రామా చేశారని… అసెంబ్లీలో చంద్రబాబు కావాలనే తమ నేతలను రెచ్చగొట్టారని జగన్ విమర్శించారు.

Related Articles

Latest Articles