మత్స్యశాఖలో ఏపీ ఉత్తమ ఫలితాలు

రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మత్స్యశాఖ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు. భారత ప్రభుత్వం మత్స్యశాఖలో నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించామని చెప్పారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈనెల 21న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రూ.10 లక్షల రూపాయలు నగదు ప్రోత్సాహకం, మెమొంటో అందించిందని మంత్రి సీఎం జగన్‌కి వివరించారు.

కేంద్ర ప్రభుత్వం అందించిన మెమొంటోను సీఎం వైయస్‌.జగన్‌ కు చూపించిన మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, అధికారులు. వారిని ప్రత్యేకంగా అభినందించారు సీఎం జగన్.

Related Articles

Latest Articles