బ్లాక్‌ ఫంగస్‌ కు వాడే ఇంజక్షన్లు చాలా కొరతగా ఉన్నాయి : సీఎం జగన్

బ్లాక్‌ ఫంగస్‌ మందుల పై సీఎం జగన్ మాట్లాడుతూ.. బ్లాక్‌ ఫంగస్‌ కు వాడే ఇంజక్షన్లు చాలా కొరతగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వీటి కొరత ఉంది అని అన్నారు. ఒక్కో రోగికి వారానికి కనీసంగా 50 ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి మనకు 3వేల ఇంజక్షన్లు మాత్రమే వచ్చాయి. మరో 2వేల ఇంజక్షన్లు వస్తాయని చెప్తున్నారు. ఇవన్నీకూడా సరిపోని పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్నాం. వీలైనంత మేర ఇంజక్షన్లు తెప్పించడానికి గట్టిగా కృషిచేస్తున్నాం. ఉన్నవాటిని జాగ్రత్తగా వినియోగించడంపై దృష్టిపెట్టాలి అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-