టీఆర్ఎస్ స‌మావేశంలో ఈట‌ల‌కు అనుకూల‌ నినాదాలు, ఘ‌ర్ష‌ణ‌

టీఆర్ఎస్ పార్టీలో ఈట‌ల అనుకూల‌, ప్ర‌తికూల వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదాలు, ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి… ఇవాళ క‌రీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్ గ్రామంలోని చేనేత సహకార సంఘం భవనంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు.. అయితే, ఈ స‌మావేశంలో జై ఈటెల నినాదాల‌ను హోరెత్తించారు కొంద‌రు కార్య‌క‌ర్త‌లు.. మండల స్థాయి టీఆర్‌ఎస్ నేత‌లు మాట్లాడుతూ వ్యక్తులు ముఖ్యం కాదు మనకు పార్టీ ముఖ్యం అని వ్యాఖ్యానించ‌డంతో.. ఈటల వర్గీయుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది.. నిన్నటి వరకు ఈటల వెంట ఉండి.. ఇప్పుడు ఈటలకు వ్యతిరేకంగా మాట్లాడటం ఏంట‌ని కొంద‌రు కార్య‌క‌ర్త‌లు మండిప‌డ్డారు.. దీంతో.. టీఆర్ఎస్, ఈటల వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.. ఘ‌ర్షణ వాతావరణం తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. న‌చ్చ చెప్పేందుకు టీఆర్ఎస్ నేత‌లు ప్ర‌య‌త్నించినా.. ఈటల వర్గీయులు.. జై ఈట‌ల నినాదాల‌తో స్వ‌రం పెంచ‌డంతో.. వారినీ పోలీసులు బయటకు తీసుకెళ్లారు.. దీంతో.. గొడ‌వ ముగిసిపోయింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-