శ్రీశైలంతో నాకు అభినాభావ సంబంధం ఉంది : ఎన్. వి.రమణ

కర్నూలు జిల్లాకు,ముఖ్యంగా శ్రీశైలంతో నాకు ఎంతో అభినాభావ సంబంధం ఉంది అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి.రమణ అన్నారు.తెలుగు గాలి, తెలుగు నేలలో వారం రోజులుగా తిరుగుతూ ఎంతో ఆనందం పొదుతున్నాను అని తెలిపారు. శ్రీశైలం నాకు ఊహ తెలిసిన నుండి ఏడాదిలో 2, 3 సార్లు శ్రీశైలం వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నాను. మొదటిసారి నేను న్యాయవాద వృత్తి చేపట్టిన తరువాత ఈ ప్రాంత సంబంధించిన ఏరాసు అయ్యప్ప రెడ్డి దగ్గర నేను జూనియర్ గా జాయిన్ అయ్యాను…. వారికి, వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందుకే నాకు కర్నూల్ జిల్లా అంటే చాలా గౌరవం ….ఇక్కడి నుండే న్యాయవాద వృత్తి ప్రారంభించి అంచెలంచెలుగా ఈ స్థాయికి చేరుకున్నాను . తక్కువ సమయంలో శ్రీశైలం వస్తున్నాను అన్నవెంటనే ఏర్పాట్లు చేసిన దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లికి, స్థానిక ఎమ్మెల్యే కి జిల్లా ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-