రేపు యాదాద్రికి సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌… గ‌వ‌ర్న‌ర్‌, సీఎం కూడా..

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తున్నారు సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌.. త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి.. గురువారం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకున్న ఆయ‌న‌.. శుక్ర‌వారం రోజు మ‌రోసారి శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు.. ఆ త‌ర్వాత తొలిసారి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆయ‌న‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైకోర్టు చీఫ్ జ‌స్టిస్, మంత్రులు స్వాగ‌తం ప‌లికితే.. రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, సీఎం కేసీఆర్ స్వాగ‌తం ప‌లికారు.. ఇక‌, ఈ సంద‌ర్భంగా రాత్రి గ‌వ‌ర్న‌ర్.. రాజ్‌భ‌వ‌న్‌లో విందు కూడా ఇచ్చారు. రాజ్‌భ‌వ‌న్‌లోనే బ‌స చేశారు సీజేఐ.. మ‌రోవైపు.. యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని కూడా ద‌ర్శించుకోనున్నారు.. జస్టిస్‌ ఎన్వీ రమణతోపాటు గవర్నర్‌ తమిళిసై‌, సీఎం కేసీఆర్‌ కూడా యాదాద్రికి వెళ్ల‌నున్నారు.. యాదాద్రిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న తెలంగాణ ప్ర‌భుత్వం.. ఆల‌యాన్ని పున‌ర్‌నిర్మిస్తుండ‌గా.. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు నిర్మాణ‌ప‌నులు పూర్తిచేశారు.. తాజాగా.. ఏర్పాటు చేసిన లైటింగ్‌తో యాద‌గిరీశుడి ఆల‌యం.. మెరిసిపోయింది.. సీఎం కేసీఆర్‌.. ద‌గ్గ‌రుండి.. సీజేఐకి.. కొత్త ఆల‌యాన్ని చూపించే అవ‌కాశం ఉందంటున్నారు.

-Advertisement-రేపు యాదాద్రికి సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌... గ‌వ‌ర్న‌ర్‌, సీఎం కూడా..

Related Articles

Latest Articles