ఆహా! అనిపించే తారల ఆహారాలు!

దీపికా పదుకొణే నుంచీ ప్రభాస్ దాకా మన స్టార్స్ ఏం తింటారు? ఈ సంగతి తెలుసుకుంటే భలేగా ఉంటుంది కదా! మరింక ఆలస్యమెందుకు…
ముంబైలో సూపర్ స్టార్ గా ఎదిగినప్పటికీ దీపిక పదుకొణే డైనింగ్ టేబుల్ వద్ద మాత్రం దక్షిణాది అమ్మాయే! ఆమె బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, ఊతప్పమ్, ఉప్మా లాంటివే ఉంటాయట!
కండల వీరుడు సల్మాన్ మంచి ఆహార ప్రియుడు. ఏది తిన్నా గట్టిగానే తింటాడు. అందుకు తగ్గట్టుగా జిమ్ లో శరీరాన్ని అరగదీసే భాయ్ జాన్ హోమ్ ఫుడ్ ని మాత్రం అస్సలు మిస్ కాడట. ఇంటి నుంచీ తయారు చేసిన ఆహారమే షూటింగ్స్ కి కూడా తీసుకెళతాడు. విదేశాలకు వెళితే చెఫ్ ని వెంట పెట్టుకుపోతాడట!
ఐష్ కి తింటాం అన్నది ముఖ్యం కాదట. ఏం తిన్నాం, ఎలా తిన్నాం అన్నదే ఇంపార్టెంట్ అంటున్నారు. ఐశ్వర్య రాయ్ ప్రయాణంలో ఉంటే మాత్రం ఆ ఫ్లైట్ లోని ఎయిర్ హోస్టెస్ కు ఉరుకులు పరుగులేనట! ఆమెని ఆహారంతో మెప్పించటం అంత తేలిక కాదని బీ-టౌన్ టాక్!
బాలీవుడ్ వారి ‘బాహుబలి’, మన ‘డార్లింగ్’ ప్రభాస్ కి కూడా నాలిక చురుకైందే! ఆయన ఫూడ్ లవ్వర్ ని ఆయనతో పని చేసిన ప్రతీ ఒక్కరూ చెబుతారు. ప్రభాస్ రాజుగారు తమరు తినటమే కాదు, తమ దర్భార్ లోని స్నేహితులు, శ్రేయోభిలాషులకు కూడా కడుపునిండా ఆహారం వడ్డిం చేస్తారట. ప్రభాస్ కోసం రెడీ అయ్యే రకరకాల బిర్యానీలు ఘుమఘుమలాడిపోతాయని టాలీవుడ్ టాక్!
ఎంత ఏజ్ వచ్చినా యవ్వనం తరగని ఫిట్ నెస్ ఫ్రీక్ మిలింద్ సోమన్. ఈయన టేస్టీ ఫూడ్ కంటే హెల్తీ ఫూడ్ ముఖ్యం అంటాడు. బ్రేక్ ఫాస్ట్ లో ఫ్రూట్స్ తీసుకునే మిలింద్ లంచ్ లో దాల్, వెజిటేబుల్స్ వంటివి ఇష్టపడతాడట!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-