నీరజ్ చోప్రాపై సినీ ప్రముఖుల ప్రశంసల జల్లు!

టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత తరఫున పాల్గొని తొలి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో భారత్ కు దక్కిన తొలి స్వర్ణమిది. అంతేకాదు అధ్లెట్స్ విభాగంలోనూ భారత్ ఒలింపిక్స్ లో అందుకున్న మొట్టమొదటి బంగారు పతకం ఇది. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. దక్షిణాదిలో చిరంజీవి, మోహన్ బాబు, మహేశ్ బాబు, మోహన్ లాల్, ఎస్. ఎస్. రాజమౌళి, మంచు విష్ణు, నాగశౌర్య, స్మిత, ప్రవీణ్ సత్తారు, దుల్కర్ సల్మాన్, ఆర్య తదితరులు నీరజ్ చోప్రాను సోషల్ మీడియా ద్వారా అభినందనలతో ముంచెత్తారు. అలానే రెజ్లింగ్ లో కాంస్య పతకాన్ని అందుకున్న భజరంగ్ పునియాను నందమూరి బాలకృష్ణ, కమల్ హాసన్, టోవినో థామస్, ఐశ్వర్యా రాజేశ్‌ తదితరులు అభినందించారు.

-Advertisement-నీరజ్ చోప్రాపై సినీ ప్రముఖుల ప్రశంసల జల్లు!

Related Articles

Latest Articles