ఆరేళ్ళ క్రితమే గిన్నిస్ బుక్ లో రాహుల్ శెట్టి పేరు!

బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు రాహుల్ శెట్టి. ‘రేస్ 3, ఏబీసీడీ సీరిస్, బాఘీ 2, హౌస్ ఫుల్ 4, జీరో’ వంటి చిత్రాలకు రాహుల్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశాడు. ఇక డాన్స్ బేస్డ్ మూవీ ‘స్ట్రీట్ డాన్సర్ త్రీడీ’లో అయితే ప్రభుదేవాతోనూ స్టెప్పులేయించాడు. అలానే టోనీ కక్కర్, షెహనాజ్ గిల్ నటించిన ‘కుర్తా పైజమా’ సాంగ్ కు కొరియోగ్రఫీతో పాటు రాహుల్ శెట్టి డైరెక్షన్ కూడా చేశాడు. చిత్రం ఏమంటే… గిన్నీస్ బుక్ హోల్డర్ అయిన రెమో డిసౌజా ఆఫీస్ లో ఉన్న ఆ సర్టిఫికెట్ ను చూసినప్పుడల్లా తనకూ అలాంటి పుస్తకంలో చోటు దక్కించుకోవాలని ఉండేదని రాహుల్ అన్నాడు. అయితే ఆరేళ్ళ క్రితం దానిని ఓ కార్యక్రమం ద్వారా సాధించినట్టు తెలిపాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం 270 మంది బృందంతో శివగంగ రోలర్ స్కేటింగ్ క్లబ్ బెల్గామ్ లో ఓ భారీ రోలర్ స్కేటింగ్ డాన్స్ ప్రోగ్రామ్ ను నిర్వహించింది. అందులో పాల్గొన్న వ్యక్తిగా రాహుల్ శెట్టి సైతం గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నాడు. అది తన తల్లిదండ్రులకు ఎంతో గర్వకారణంగా ఉండేదని రాహుల్ చెబుతున్నాడు. అయితే రాబోయే రోజుల్లో సినిమా డాన్సర్ గానూ ఆ పుస్తకంలోకి ఎక్కాలన్నది తన కోరిక అని ఈ కొరియోగ్రాఫర్ తెలిపాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-