చిత్తూరు జిల్లా పర్యటనలో చంద్రబాబుకు షాక్.. అనుమతి ఇవ్వని పోలీసులు

చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు షాకిచ్చారు. తిరుపతి సమీపంలో ఉన్న రాయలచెరువు ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్లాలనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రాయలచెరువును రెడ్‌జోన్‌గా గుర్తించామని… గండి పడటంతో మరమ్మతు పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

Read Also: ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

రాయలచెరువు వద్ద మరమ్మతుల పనులు జరుగుతుండటంతో చంద్రబాబు కాన్వాయ్ వెళ్లేందుకు ఇబ్బంది ఎదురవుతుందని పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు తాము భద్రత కల్పించలేమని.. అందుకే పర్మిషన్ నిరాకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా చంద్రబాబుకు అనుమతి ఇవ్వకపోవడంతో టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో చంద్రబాబు రాయలచెరువు పర్యటన ఉద్రిక్తంగా మారింది.

Related Articles

Latest Articles