‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ నుంచి సోల్ ఫుల్ సాంగ్

అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి చివరి సాంగ్ “చిట్టి అడుగా” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సోల్ ఫుల్ గా సాగిన ఈ సాంగ్ కు సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంది. సింగర్ జియా ఉయ్ హఖ్ పాడిన ఈ సాంగ్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా దసరా కానుకగా విడుదల కానుంది.

Read Also : వీడియో : “అనుభవించు రాజా” టైటిల్ సాంగ్

మరో నాల్రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రమోషన్లలో వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘లెహరాయి’ సాంగ్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించారు. ఈ చిత్రంలో అఖిల్‌ హర్షగా, పూజా హెగ్డే విభా అనే పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఈ నెల 15న థియేటర్లలోకి రానున్నాడు.

-Advertisement-'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' నుంచి సోల్ ఫుల్ సాంగ్

Related Articles

Latest Articles