తెలంగాణ ఆడపడుచు ‘బతుకమ్మ’ కు స్వాగతం : చిరంజీవి

తెలంగాణ వాసులు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ‘బతుకమ్మ’ సంబరాలు మొదలయ్యాయి. ఈ తొమ్మిది రోజులూ సాయంత్రం కాగానే అందమైన పూలతో తయారు చేసిన ‘బతుకమ్మ’ను మధ్యలో పెట్టి చుట్టూ చేరి మహిళలంతా ఆటపాటలతో సందడి చేస్తారు. 9 రోజులపాటు రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తూ రోజుకో పేరుతో బతుకమ్మను సెలెబ్రేట్ చేసుకుంటారు. అందులో ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ… ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది బతుకమ్మలన్నమాట.

Read Also : ‘బతుకమ్మ’ శుభాకాంక్షలు.. విజయ్ దేవరకొండ వరుస పోస్టులు

కాగా ‘బతుకమ్మ’ సంబరాలు ప్రారంభమైన నేపథ్యంలో పలువురు సెలెబ్రిటీలు విష్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తెలంగాణ ఆడపడుచు ‘బతుకమ్మ’ కు స్వాగతం అంటూ విష్ చేశారు. “ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ‘ బతుకమ్మ’ కు స్వాగతం. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం.ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

-Advertisement-తెలంగాణ ఆడపడుచు 'బతుకమ్మ' కు స్వాగతం : చిరంజీవి

Related Articles

Latest Articles