”పెళ్లి సందD” ఈవెంట్ లో సందడి చేయనున్న చిరు, వెంకీ

‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. రోషన్ కు జంటగా శ్రీలీల నటిస్తోంది. అయితే ఈ చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో రాఘవేంద్రరావు శిష్యురాలు అయిన గౌరి రోనక్ కొత్త దర్శకురాలిగా పరిచయం కాబోతుంది. ఇక శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాకు సంగీతం అందించిన కీరవాణి ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాపడి ఈ నెల 15న అభిమానుల ముందుకు రాబోతుంది.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 10 హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెషన్ లో నిర్వహించనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ సినిమాకు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ వస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇక రాఘవేంద్రరావు దర్శకత్వం చిరంజీవి, వెంకటేష్ లు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఇక రోషన్ తండ్రి శ్రీకాంత్ మాత్రం చిరంజీవిని సొంత అన్నయ లాగానే భావిస్తాడు. ఆయనతో కలిసి సినిమాల్లో నటించాడు కూడా.

రోషన్ పెళ్లి సందD నుండి ఇప్పటికే విడుదల అయిన పాటలు మంచి హిట్ అయ్యాయి. అయితే కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత హీరోగా 1996లో వచ్చిన ‘పెళ్ళి సందడి’ సీమకు కూడా కీరవాణి నే సంగీతం అందించారు. ఆ పాటలను అభిమానులు ఇప్పటికి మర్చిపోలేదు. ఆ సినిమా అప్పుడు సూపర్ డూపర్ హిట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ పెళ్లి సందD కి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండటంతో ఈ సినిమా పై కూడా అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ను చూస్తుంటే ఆ పెళ్ళి సందడి శ్రీకాంత్ కెరీర్‌ లో ఓ మైలురాయిగా ఎలా నిలిచిపోయిందో… ఈ పెళ్లి సందD కూడా రోషన్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది అని అనిపిస్తుంది.

-Advertisement-''పెళ్లి సందD'' ఈవెంట్ లో సందడి చేయనున్న చిరు, వెంకీ

Related Articles

Latest Articles