కైకాల ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్

టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. నిన్న ఆయన ఆరోగ్యానికి సంబంధించి అపోలో ఆస్పత్రి నుంచి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అందులో కైకాల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అప్పటి నుంచి కైకాల అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా కైకాల త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కైకాల ఆరోగ్యానికి సంబంధించి ట్వీట్ చేశారు. అందులో కైకాల ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చిన చిరంజీవి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

Read Also : కంగనాపై సిక్కు కమ్యూనిటీ ఫైర్… కేసు నమోదు

“ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీ కైకాల సత్యనారాయణ గారు స్పృహ లోకి వచ్చారని తెలియగానే ఆయనకు వైద్యం చేస్తున్న క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి గారి సహాయంతో ఆయన్ని ఫోన్లో పలకరించాను. ఆయన త్వరగా కోలుకుంటారని పూర్తి నమ్మకం కలిగింది. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా మళ్ళీ త్వరలో ఇంటికి తిరిగి రావాలని, ఆ సందర్భాన్ని అందరం సెలబ్రేట్ చేసుకోవాలని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థమ్స్ అప్ సైగ చేసి చూపించినట్టుగా డాక్టర్ సుబ్బారెడ్డి గారు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా రావాలని ప్రార్ధిస్తూ, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు అందరితోనూ ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది” అంటూ చిరు ట్వీట్ చేశారు. కైకాల అనారోగ్యం గురించి ఆందోళన పడుతున్న అందరికీ చిరంజీవి ట్వీట్ ఊరట కలిగిస్తుందని చెప్పొచ్చు.

Related Articles

Latest Articles