‘మా’ నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు : చిరంజీవి

నూతన ‘మా’ అధ్యక్షుడికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 10న ఉదయం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో ‘మా’ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు కొనసాగిన పోలింగ్ కేంద్రం వద్ద హైడ్రామా నడిచింది. ఇరు ప్యానల్ ల సభ్యులు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. పోలింగ్ కేంద్రంలోనూ అసభ్యకర భాషలో ఒకరినొకరు తిట్టుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ వాళ్లు బయటకు వచ్చాక మాత్రం మేము అంతా ఒకటే అని, ఎన్నికలు బాగా జరుగుతున్నాయి అని సర్ది చెప్పుకున్నా రు. ఇక ఒకానొక సమయంలో రిగ్గింగ్ ఆరోపణలు కూడా వినిపించాయి. మూడు గంటలకు పూర్తయిన పోలింగ్ లో 83 శాతం మంది తమ ఓటును వినియోగించుకున్నారు. ఇది మా చరిత్రలోనే రికార్డు అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత మొదలైన కౌంటింగ్ క్షణక్షణం అంచనాలను తలకిందులు చేస్తూ సాగింది. అలా ఎట్టకేలకు నిన్న రాత్రి 9 గంటల సమయంలో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు భారీ మెజారిటీతో గెలవడంతో ఆయనను అధ్యక్షుడుగా ప్రకటించారు.

Read Also : “మా”కు మెగా బ్రదర్ రాజీనామా

ఇక ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. “మా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు కి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ కి మిగతా విజేతల అందరికీ పేరు పేరునా అభినందనలు శుభాకాంక్షలు. మా నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులు అందరి సంక్షేమానికి పాటు పడుతుందని ఆశిస్తున్నాను. మా ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే కుటుంబం, ఇందులో ఎవరు గెలిచినా మనసు కుటుంబం గెలిచినట్టే. ఆ స్పూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో ఓడిపోవడం గమనార్హం.

-Advertisement-'మా' నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు : చిరంజీవి

Related Articles

Latest Articles