హీరోలందరూ కలిసి ఉంటే అది జరగదు : చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఉండాల్సిన హెల్దీ వాతావరణం గురించి మాట్లాడారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న సినిమా “పెళ్లి సందD” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి తాజాగా ఇండస్ట్రీలో నెలకొన్న పలు విషయాలను కూడా ప్రస్తావించారు. “పెళ్లి సందD” వేడుకలో అదే వేదికపై ‘మా’ గురించి ఇన్ డైరెక్ట్ కౌంటర్ వేశారు. “నా చిరకాల మిత్రుడు విక్టరీ వెంకటేష్. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరు అభిమానం. ఆయన సినిమాలు ఏవి బాగున్నా ఆపుకోలేక ఫోన్ చేసి మరీ బాగుందని చెప్తాను. ఇటీవల ‘నారప్ప’లో నా స్నేహితుడు వెంకటేష్ కన్పించలేదు నాకు. కేవలం నారప్ప కన్పించాడు. ఆయన కూడా ‘సైరా’ చూసి బాగుందని ఫోన్ చేసి చెప్పాడు.

Read Also : ‘మా’ ఫలితాలు కొన్ని హోల్డ్ చేయడానికి కారణం అదేనా!?

ఇలా ఒకరికి ఒకరం వ్యక్తిగతంగా అప్రిషియేట్ చేయడం చాలా హెల్దీగా ఉంటుంది. అందరు హీరోల మధ్య ఇలాంటి ఆహ్లాదకర పరిస్థితి ఉంటే హీరోల మధ్య గొడవలు, మాటలు అనడాలు, అన్పించుకోవాటాలు… ఇది ఉండవు కదా. ఏదైనా తాత్కాలికమే. ముఖ్యంగా పదవులు, చిన్న చిన్న బాధ్యతల లాంటివి. వాటి కోసం అనడం, అనిపించుకోవడం… ఒక పదవి కోసం బయట వాళ్లకు అంత లోకువ కావాలా ? ప్రతి ఒక్కరూ మెచ్యూరిటీగా ఉండాలి. వివాదాలు ఎక్కడ మొదలయ్యాయి గుర్తు పెట్టుకోండి. ఇటీవల కాలంలో జరిగిన వాటన్నింటికీ కారణం ఎవరో అలోచించి వాళ్ళను దూరం పెడితే మనది వసుదైక కుటుంబం. ఈ వివాదాల వల్ల మనం ఇంకొకరికి ముఖ్యంగా మీడియాకు ఆహరం కావొద్దు” అంటూ చెప్పుకొచ్చారు.

-Advertisement-హీరోలందరూ కలిసి ఉంటే అది జరగదు : చిరంజీవి

Related Articles

Latest Articles