వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి… కొత్తజంటకు చిరు ఆశీస్సులు

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ పెళ్లి నేడు హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. కార్తికేయ లోహితా రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. వధూవరులిద్దరినీ చిరు ఆశీర్వదించారు. ప్రస్తుతం ఆయన అయ్యప దీక్షలో ఉన్నందున, అతను పూర్తిగా నలుపు రంగు దుస్తులలో కనిపించాడు. ఇక వరుడు కార్తికేయ క్రీమ్, బంగారు షేర్వాణీతో జతగా క్రీమ్ లోఫర్‌లు, మ్యాచింగ్ పగడి, బ్రూచ్, నెక్లెస్ ధరించి కన్పించాడు. పెళ్లికూతురు కూడా బంగారు రంగు దుస్తుల్లో, వాటికి తగ్గ జ్యూవెలరీలో మెరిసిపోయింది. ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌తో బంగారు, పింక్ పట్టు చీరను కట్టుకుంది లోహిత.

Read Also : కైకాల ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్

కార్తికేయ వరంగల్‌ లో ఎన్ఐటి విద్యార్థిగా ఉన్నప్పటి నుండి లోహిత ఆయనకు స్నేహితురాలు. ఈ జంట ఈ సంవత్సరం ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ‘రాజా విక్రమార్క’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రపోజ్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కాగా తాజాగా జరిగిన కార్తికేయ, లోహిత పెళ్ళికి ఇతర ప్రముఖులు కూడా విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించారు. కార్తికేయ ప్రస్తుతం తల అజిత్ తాజా చిత్రం ‘వాలిమై’లో విలన్ గా నటిస్తున్నాడు.

Image
Image

Related Articles

Latest Articles