బ్లాక్ అండ్ బ్లాక్ లో తండ్రితో చరణ్… పిక్ వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ లో ఇద్దరూ బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తులు ధరించారు. రామ్ చరణ్ హ్యాండ్సమ్ లుక్ లో ఉండగా… చిరంజీవి మ్యాన్లీ లుక్ లో కన్పిస్తున్నారు. అయితే ఈ పిక్ కు ఓ స్పెషలిటీ ఉంది. అదేంటంటే… ఈరోజు ఫాదర్స్ డే. ఈ సందర్భంగా తన తండ్రి చిరంజీవికి పితృ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ చరణ్ తన ట్వీట్ లో ఈ పిక్ ను షేర్ చేశారు.

Also Read : నాని “దారే లేదా” సాంగ్ కు విశేష స్పందన

చరణ్ ఈ పిక్ కు “మీతో టైమ్ ఎప్పటికి విలువైనది !! పితృ దినోత్సవ శుభాకాంక్షలు !!!” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు, చరణ్ కలిసి నటించబోతున్నారు. మరోవైపు చరణ్ “ఆర్ఆర్ఆర్” చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-