చిరాగ్ పాశ్వాన్‌కు షాక్‌.. అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గింపు..!

బీహార్ రాజ‌కీయాలు మ‌రోసారి హాట్‌టాపిక్‌గా మారిపోయాయి… గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హ‌డావిడి చేసిన యువ నేత చిరాగ్‌ పాశ్వాన్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది.. లోక్‌ జనశక్తి పార్టీలో తిరుగుబాటు రావ‌డంతో ఈ ప‌రిణామం చోటు చేసుకుంది.. చిరాగ్‌ పాశ్వాన్‌ బాబాయ్‌, ఎంపీ పశుపతి పరాస్‌ నేతృత్వంలో ఎల్జేపీలో తిరుగుబాటు చేశారు.. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు… లోక్‌సభలో ఎల్జేపీ నేతగా పరాస్‌ను ఎన్నుకున్నట్లు ఇప్ప‌టికే స్పీకర్‌ ఓం బిర్లాను స్వయంగా కలసి తెలియ‌జేయ‌గా.. పరాస్‌ను ఎల్జేపీ పక్షనేతగా గుర్తిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్ కూడా విడుద‌ల చేశారు.. ఇక‌, ఇవాళ అత్యవసరంగా భేటీ అయిన పరాస్ టీమ్.. లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి చిరాగ్ పాశ్వాన్‌ను తొల‌గిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.. ఇక‌పై.. ఎల్జేపీ పార్లమెంటరీ నేతగా, పార్లమెంటరీ బోర్డు చైర్మన్‌గా, జాతీయాధ్యక్షుడిగా కూడా ప‌రాస్ ఉంటార‌ని స్ప‌ష్టం చేసింది.. మ‌రోవైపు ఈ ప‌రిణామాల త‌ర్వాత పార్టీ సభ్యులతో వర్చువల్‌ సమావేశం ఏర్పాటు చేశారు చిరాగ్… అధిష్టానం ఆదేశాలు బేఖాతరు చేసిన ఎంపీలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ ప‌రిణామాల‌తో బీహార్ రాజ‌కీయాలు మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారిపోయాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-