మా కాంగ్రెస్ పార్టీలో ఏమైనా జరగొచ్చు అంటున్న మాజీ కేంద్ర మంత్రి

మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ కాంగ్రెస్ పార్టీపై షాకింగ్ కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరు.. కేడర్ లేదు. ఇదే పెద్ద సమస్య అని ఆయన తెలిపారు. రాజా మహరాజాల రోజులు కావు.. అందుకే పంజాబ్ లో సీఎంను తీసి అవతల పారేశారు అన్నారు. కొన్ని నిర్ణయాలు చేయాలనుకుంటారు.. చేస్తారు.. వైెెఎస్సారును సీఎం చేయొద్దని చెప్పాను.. కానీ చేశారు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీలో ఏ క్షణమైనా.. ఏమైనా జరగొచ్చు అని పేర్కొన్నారు.

ఇక రాష్ట్రంలో బడుగులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. సుమారు 80 లక్షల మందికి స్కాలర్ షిప్పులు ఇవ్వడం లేదు. రెండేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్ధులకు స్కాలర్ షిప్పులు ఇవ్వడం లేదు. ఈ స్కాలర్ షిప్పులకు సంబంధించిన కేంద్ర నిధులు 75 శాతం విడుదల చేశారు. స్కాలర్ షిప్పుల నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. దీపావళీ పండుగలోగా స్కాలర్ షిప్పులను విడుదల చేయాలి అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్ కార్పోరేషన్లు ఏపీలో నిర్వీర్యమయ్యాయి. గత రెండేళ్లల్లో ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా ఒక్క రుణమైనా ఇచ్చారా అని ప్రశ్నించిన ఆయన ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్ కార్పోరేషన్లను సున్నా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. చచ్చిందా.. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్సులకు దమ్ములేదా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరా అని అడిగారు. ప్రభుత్వం గిఫ్టులు ఇస్తోంది.. కానీ స్కాలర్ షిప్ అనేది హక్కు. స్కాలర్ షిప్పు అనే పదాన్ని ఈ ప్రభుత్వం నాశనం చేస్తోంది అన్నారు.

-Advertisement-మా కాంగ్రెస్ పార్టీలో ఏమైనా జరగొచ్చు అంటున్న మాజీ కేంద్ర మంత్రి

Related Articles

Latest Articles