ఏపీ విద్యుత్ సంక్షోభం లోకి వెళ్లబోతుంది…

అమ్మకానికి భారత దేశం ఉందని… వేలకోట్ల పెట్టి విమానాలు కొని తిరుగుతున్నారు మొట్టమొదటి ప్రధాని మోడీ అని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి పెట్టారు మొట్టమొదటి ప్రధాని మోడీ. క్యాబినెట్ సమావేశనికి ఆలస్యంగా వస్తారు కానీ ఏఒక్క మంత్రి గొంతు వినపడదు. చివరకు విద్యుత్ డిస్కంలు అమ్మకానికి పెట్టిన ఘనుడు ఆయన అన్నారు. దేశంలో గడ్డుకాలం నడుస్తుంది.. రైతులను జీపులతో గుద్ది చంపించారు అని తెలిపారు.

ఇక ఏపీలో విద్యుత్ సంక్షోభం లోకి వెళ్లబోతుంది అని తెలిపారు. నవరత్నాల పేరుతో పేదల నవరంధ్రాలు మూసివేస్తున్నాడు ముఖ్యమంత్రి జగన్. విద్యార్థులకు స్కాలర్షిప్ లు లేవు చదువుకోవాలంటే పేదవిద్యార్ధి అష్టకష్టాలు పడుతున్నారు. త్వరలోనే విద్యార్థుల ఆత్మహత్యలు ప్రారంభమవుతాయి. అందుకే 80లక్షల విద్యార్ద్యులకు స్కాలర్షిప్స్ నవంబర్1వ తారికు లోపల ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేకమంది రాజకీయ నాయకులు స్కాలర్షిప్ లతో చదుకున్నవారు కోకొల్లలు. పేదవాడికి అన్యాయం జరుగుతుంది సంపన్నులకు బీజేపీ కొమ్ముకాస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆదాని అభివృద్ధి కాదు పేదల అభివృద్ధి కావాలి. చంద్రబాబు తొందరబాబుగా మారారు. రాజధాని మహిళా రైతుల కన్నీళ్లతో ఈ ప్రభుత్వం సర్వనాశనం అవుతుంది. రాజధాని రైతులకోసం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి పనిచేస్తుంది. ప్రతి దళిత క్రిస్టియన్ కు ఎస్సి స్టేటస్ వచ్చేవిదంగా పోరాటం చేస్తాం. రాజధాని రైతులకోసం రాహుల్ గాంధీని తీసుకువస్తాం. 1990లో డిసెంబర్ నెలలోనే ఏపీని విభజించారు అది ఎవ్వరికీ తెలియదు. విభజన తరువాత కాంగ్రెస్ మీద అపవాదు వేశారు, కానీ విభజన కారకులు మాత్రం హీరోల్లాగా తిరుగుతున్నారు. దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ శ్రీరామ రక్షగా ఉంటుంది అని పేర్కొన్నారు.

-Advertisement-ఏపీ విద్యుత్ సంక్షోభం లోకి వెళ్లబోతుంది...

Related Articles

Latest Articles