సైనాపై సిద్ధార్థ్ ట్వీట్ వివాదం… చిన్మయి షాకింగ్ కామెంట్స్

సైనా నెహ్వాల్‌ పై నటుడు సిద్ధార్థ్ చేసిన అభ్యంతరకర ట్వీట్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా లోపంపై సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్‌పై సిద్ధార్థ్ స్పందించి అవాంఛనీయ వివాదంలో పడ్డాడు. “సబ్టిల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ వరల్డ్… థాంక్ గాడ్ వి హ్యావ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా. షేమ్ ఆన్ యూ #రిహన్నా” అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు.

Read Also : కట్టప్పను ఎవరు చంపారు ?… ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ సెటైర్

అయితే ఈ ట్వీట్ పెను వివాదాన్ని సృష్టించగా నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు కూడా ఒకరి తర్వాత ఒకరు నటుడిపై దుమ్మెత్తి పోస్తున్నారు. శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది, మరికొందరు ఆయన చేసిన ట్వీట్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ఇప్పుడు ఈ జాబితాలో చేరిపోయింది పాపులర్ సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద. స్వతహాగా స్త్రీవాది అయిన చిన్మయి ట్వీట్ ద్వారా సిద్ధార్థ్ విరుచుకుపడ్డారు. సిద్ధార్థ్ తన ట్వీట్ కు వివరణ ఇచ్చినప్పటికీ మరో నటి ధన్య రాజేంద్రన్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసింది. అందులో ధన్య రాజేంద్రన్ “ఈ రకమైన ‘హాస్యం’ అసంబద్ధం, చెత్తగా ఉంటుంది” అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సిద్ధార్థ్ ను భారీ ఎత్తున ట్రోల్ చేస్తుంటే, మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆయన ట్వీట్ పై చర్చ నడుస్తోంది.

సైనాపై సిద్ధార్థ్ ట్వీట్ వివాదం… చిన్మయి షాకింగ్ కామెంట్స్

Related Articles

Latest Articles