బర్త్ డే సర్‌ప్రైజ్: ప్రత్యేక పాత్రలో చిన్మయి

గాయనిగా, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన చిన్మయి త్వరలోనే నటిగా సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌లు, పోస్టర్లు, టీజర్‌ విడుదలై ఆకట్టుకొన్నాయి. అయితే నేడు చిన్మయి పుట్టిన రోజు సందర్బంగా ఆమె ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఆమెను అభినందిస్తూ.. ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

చిన్మయికి అక్కినేని ఫ్యామిలీతో మంచి అనుబంధం వున్నా సంగతి తెలిసిందే.. స్టార్ హీరోయిన్ సమంతకు ఈమె చాలా సహజంగా డబ్బింగ్ చెప్పుతుంది. తెలుగు, తమిళ భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా .. సింగర్ గా రాణిస్తున్న చిన్మయి.. నటిగా ఈమేరకు మెప్పిస్తోందనేది చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-